DRDO BrahMos 800 km Upgrade: పాకిస్తాన్‌కి భారత్ తరఫున గట్టి హెచ్చరిక వచ్చేసింది. “మీ భూభాగం ప్రతి అంగుళం మా బ్రహ్మోస్ పరిధిలో ఉంది. ఒక అడుగు ముందుకు వేస్తే ఫలితాలు ఘోరంగా ఉంటాయి!” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు చెమటలు పట్టించిన బ్రహ్మోస్ క్షిపణి త్వరలో మరింత అప్‌గ్రేడ్ వెర్షన్‌లో రాబోతోంది. ఈ బ్రహ్మోస్ 2.O సిద్ధమైతే, భారత రక్షణ సామర్థ్యం కొత్త పుంతలు తొక్కనుంది.
![]() |
India’s 800 Km BrahMos |
800 కిలోమీటర్ల పరిధితో మరింత శక్తివంతమైన వెర్షన్: ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణి 450 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. కానీ కొత్తగా రాబోతోన్న బ్రహ్మోస్ 2.O అయితే 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా చేధించగలదు. ఇది శబ్ద వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. ఇందులో కొత్త ర్యామ్‌జెట్ ఇంజిన్, ఆధునిక నావిగేషన్ సిస్టమ్, మరియు అధిక ఖచ్చితత్వం కలిగిన టార్గెట్ ట్రాకింగ్ టెక్నాలజీ అమర్చబడ్డాయి. 2027 నాటికి ఈ క్షిపణులు పూర్తి స్థాయిలో భారత సైన్యంలో ప్రవేశించనున్నాయి.
Also Read: 32,000 అడుగుల ఎత్తులో DRDO స్వదేశీ పారాచూట్ పరీక్ష విజయవంతం!
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తోనే కొత్త శక్తి: నిపుణుల ప్రకారం, బ్రహ్మోస్ 2.Oని పాత లాంచర్లలోనే ఉపయోగించవచ్చట. కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అంటే పెద్దగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్పులు లేకుండానే భారత్ తన క్షిపణి శక్తిని రెట్టింపు చేసుకోబోతోంది.
కొత్త నావిగేషన్ టెక్నాలజీతో ఖచ్చితమైన దాడి: బ్రహ్మోస్ 2.Oలో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (INS) మరియు గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ (GNSS) కలిపిన సరికొత్త కాంబినేషన్ వినియోగించబడుతోంది. దీనివల్ల ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా 800 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా చేధించగలదు.
అన్ని సైనిక విభాగాలకూ అప్‌గ్రేడ్ ప్లాన్: ప్రస్తుతం భారత నౌకాదళం వాడే బ్రహ్మోస్ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ రేంజ్ పెంచుతున్నారు. తర్వాత ఆర్మీ మరియు ఎయిర్‌ఫోర్స్ వాడే వెర్షన్లను కూడా బ్రహ్మోస్ 2.O ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నారు. దీని ద్వారా మూడు విభాగాల సైన్యాలకూ సమానంగా దాడి శక్తి అందుతుంది.
ఆస్ట్రా ప్రాజెక్ట్ - వాయుసేనలో మరో విప్లవం: బ్రహ్మోస్‌తో పాటు డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రా మార్క్-2 క్షిపణి కూడా భారత్‌కి మరొక బలమైన ఆయుధం కానుంది. ఇది 200 కి.మీ దూరంలో ఉన్న శత్రు విమానాలను ధ్వంసం చేయగలదు. ప్రస్తుతం వాడుతున్న ఆస్ట్రా మార్క్-1 కంటే ఇది రెట్టింపు శక్తివంతం. ఈ క్షిపణులు సుఖోయ్-30ఎంకెఐ, తేజస్ యుద్ధవిమానాల కోసం రూపొందించబడ్డాయి. భవిష్యత్తులో రాబోయే మార్క్-3 అయితే 350 కి.మీ రేంజ్‌తో మరింత అధునాతనంగా ఉంటుంది.
రక్షణ రంగంలో భారత్ దూకుడు: ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్‌గా పనిచేస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇప్పటివరకు ₹58,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. 2024లో రక్షణ మంత్రిత్వ శాఖ ₹19,519 కోట్లతో 220 బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం నేవీకి చెందిన 20 యుద్ధ నౌకల్లో బ్రహ్మోస్ లాంచ్ వ్యవస్థలు అమర్చబడ్డాయి. అలాగే వాయుసేన కోసం మరో 110 ఎయిర్-లాంచ్‌డ్ బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు ₹10,800 కోట్ల ఆమోదం కూడా లభించింది.
స్వదేశీ శక్తికి నిదర్శనం: బ్రహ్మోస్ 2.O భారత్ రక్షణ వ్యవస్థలో కొత్త యుగాన్ని ప్రారంభించబోతోంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులు భారత్‌ను ఆత్మనిర్భర్ డిఫెన్స్ నేషన్ గా నిలబెడుతున్నాయి.